ఈద్ అల్ ఫితర్ 2023: గల్ఫ్ దేశాలలో మొదలైన పండుగ వాతావరణం
- April 21, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ 2023 సందర్భంగా GCC దేశాలలో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం జీసీసీ దేశాలలో చంద్రుడు కనిపించడంతో ఈద్ అల్ ఫితర్ సందడి ప్రారంభమైంది.జీసీసీ దేశాల్లోని ముస్లిం సోదరుల నివాసితులు తమ ప్రియమైన వారితో పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.ఈద్ సందర్భంగా లాంగ్ వీకెండ్ వచ్చిన కారణంగా విమాన సర్వీసులు దాదాపుగా క్లోజ్ అయ్యాయి. అనేక ట్రావెల్ ప్యాకేజీలు ముందుగానే అమ్ముడయ్యాయని అగ్రిగేటర్లు తెలిపారు.
బహ్రెయిన్
దేశంలోని షరియా విజన్ అథారిటీ ప్రకారం.. ఏప్రిల్ 21 ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు.
కువైట్
కువైట్ షరియా విజన్ అథారిటీ ఏప్రిల్ 21, షవ్వాల్ నెల మొదటి రోజు, ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు అని ప్రకటించింది.
ఒమన్
గురువారం 1444 AH సంవత్సరానికి షవ్వాల్ నెలవంక కనిపించలేదు. దీంతో ఏప్రిల్ 22( శనివారం) ఈద్ అల్ ఫితర్ మొదటి రోజుగా ఒమన్ ప్రకటించింది. ఇంతకుముందు..ఒమన్ ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 24 వరకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించింది.
ఖతార్
గురువారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ఏప్రిల్ 21న దేశంలో ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు అని ఖతార్ ప్రకటించింది.
సౌదీ అరేబియా
పవిత్ర మాసం ముగింపును సూచించే నెలవంక సౌదీ అరేబియాలో గురువారం సాయంత్రం కనిపించింది. అందువల్ల, సౌదీ సుప్రీంకోర్టు ప్రకారం.. ఏప్రిల్ 21, ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు.
యూఏఈ
యూఏఈలో గురువారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కనిపించింది. దేశంలో ఏప్రిల్ 21న ఈద్ అల్ ఫితర్ 2023 మొదటి రోజుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







