కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుని చంపేస్తామని బెదిరింపు లేఖ..!
- May 09, 2016
తమిళనాడులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి షాకింగ్ తగిలింది. మే 16న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాహుల్ పుదుచ్చేరిలో ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే రాహుల్ గాంధీని చంపేస్తామని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ బెదిరింపు లేఖలు వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ బెదిరింపు లేఖలు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అహమ్మద్ పటేల్, ఆనంద్ శర్మ తదితరులు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కలిసి రాహుల్ గాంధీకి భద్రత పెంచాలని వినతి పత్రం సమర్పించారు. బెదిరింపు ఉత్తరాలు పంపిన ఘటనపై విచారణ చేపట్టాలని మనవి చేశారు. 1991లో రాహుల్ తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా హత్యకు గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని అంతం చేస్తామని బెదిరింపు లేఖలు రావడంతో కాంగ్రెస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. పుదేచ్చేరి పార్టీ నాయకులు ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు తెలియజేశారు. బెదిరింపు లేఖలు తమిళంలో రాశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు దర్యాప్తులో ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







