'కబాలి' చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది
- May 09, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'కబాలి' చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. గతేడాది జులై 10న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'బాహుబలి' చిత్రం ట్రైలర్ హిట్స్‌ను కబాలి టీజర్ అధిగమించింది. 2015 జూన్ 1న యూట్యూబ్‌లో విడుదలైన 'బాహుబలి' తెలుగు ట్రైలర్ వ్యూస్‌ను 2016 ఏప్రిల్ 30న విడుదలైన 'కబాలి' టీజర్ దాటింది. బాహుబలి ట్రైలర్ విడుదలై ఏడాది దాటగా... ఇప్పటి వరకు దాన్ని మొత్తం 1.30 కోట్ల మందికిపైగా చూశారు. కానీ కబాలి తమిళ టీజర్ విడుదలై పది రోజులు కాకముందే 1.58 కోట్ల మందికిపైగా వీక్షించారు.
తనదైన స్టైల్‌తో డైలాగ్‌లు విసురుతూ టీజర్‌తోనే ఇంతగా ఆకట్టుకున్న తలైవా మరి ట్రైలర్, సినిమాతో ప్రేక్షకులను ఇంకెంతగా అలరించనున్నారో వేచి చూడాలి. ఈ చిత్రంలో రజనీకాంత్‌కి జతగా రాధికా ఆప్టే నటించారు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







