వర్షాల కారణంగా ఒమన్‌లో డిస్టెన్స్ లెర్నింగ్ అమలు

- April 25, 2023 , by Maagulf
వర్షాల కారణంగా ఒమన్‌లో డిస్టెన్స్ లెర్నింగ్ అమలు

మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా.. విద్యార్థుల భద్రత దృష్ట్యా మంగళవారం డిస్టెన్స్ లెర్నింగ్ ను అమలు చేస్తున్నట్లు సూర్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ మేరకు యూనివర్శిటీ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, లోయలను దాటడం వంటి సహసాలు చేయవద్దని, వరద ప్రాంతాలకు దూరంగా ఉండాలని యూనివర్సిటీ తన ప్రకటనలోసూచించింది. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్‌లో ఉన్న వాతావరణ పరిస్థితులు,  భారీ వర్షాల వల్ల కలిగే నష్టాల గురించి నేషనల్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (NMHEWS) జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com