దుబాయ్ డిప్యూటీ పాలకులుగా షేక్ మక్తూమ్, షేక్ అహ్మద్
- April 29, 2023
దుబాయ్: షేక్ మక్తూమ్ బిన్ మహ్మద్, షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్‌లను ఎమిరేట్ మొదటి, రెండవ డిప్యూటీ పాలకులుగా నియమిస్తూ.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుక్రవారం ఒక డిక్రీని జారీ చేశారు.
షేక్ మక్తూమ్ 2008 నుండి దుబాయ్ డిప్యూటీ రూలర్‌గా ఉన్నారు. మార్చి 2021లో మరణించే వరకు యూఏఈ ఆర్థిక మంత్రిగా ఉన్న దివంగత షేక్ హమ్దాన్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో కలిసి పనిచేశారు. షేక్ మక్తూమ్ యూఏఈ ఆర్థిక మంత్రి, ఎమిరేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మొదటి డిప్యూటీ ఛైర్మన్. అతను అక్టోబర్ 12, 2021 నుండి జనరల్ బడ్జెట్ కమిటీ ఛైర్మన్, ఫెడరల్ టాక్స్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.
షేక్ అహ్మద్ ప్రస్తుతం దుబాయ్ మీడియా కౌన్సిల్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అతను యూఏఈ జాతీయ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతేడాది అతను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఫాల్కన్రీ స్పోర్ట్స్ అండ్ రేసింగ్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. కొత్త డిక్రీ జారీ చేసిన తేదీ నుండి అమలులోకి వస్తుందని, అధికారిక గెజిట్‌లో ప్రచురించబడుతుందని అదికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







