‘లైగర్’ ఆన్ డ్యూటీ.! VD12 మొదలెట్టేశాడుగా.!

- May 03, 2023 , by Maagulf
‘లైగర్’ ఆన్ డ్యూటీ.! VD12 మొదలెట్టేశాడుగా.!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్‌లో పిచ్చ పిచ్చగా క్రేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ, ‘లైగర్’ సినిమా ఆ క్రేజ్ పూర్తిగా డ్యామేజ్ చేసేసుకున్నాడు.

‘లైగర్’ డిజాస్టర్‌తో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రి తెచ్చుకున్న స్టార్‌డమ్ అంతా నాశనమైపోయింది. అంతలా ‘లైగర్’ విజయ్ దేవరకొండ అడ్రస్‌ని గల్లంతు చేసేసింది.
ఇక, రౌడీ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఖుషి’ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు. వీలైనంత తొందరగా ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని ట్రై చేస్తున్న రౌడీకి, సమంత అనారోగ్యం కారణంగా ఆ ఆశ నెరవేరడం లేదు. ఈ మధ్యనే ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలైన సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఒకటి ఆ మధ్య అనౌన్స్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఆ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ రోజు అనగా బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. 
త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్సయినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com