వరుణ్ తేజ్ నమ్మకమేంటీ.?

- May 03, 2023 , by Maagulf
వరుణ్ తేజ్ నమ్మకమేంటీ.?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘గాంఢీవధారి అర్జున’. యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న సినిమా అని టైటిల్ రివీల్‌తోనే కన్‌ఫామ్ చేశారు.

జాతీయ అవార్డు విన్నర్ అయిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇటీవల నాగార్జునతో చేసిన ‘ది ఘోస్ట్’ సినిమా నిరాశపరిచింది. ‘ఎఫ్ 3’ వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమాకి ఓకే చేశాడంటే ఖఛ్చితంగా సినిమాలో విషయముండాల్సిందే. 
కథ చెప్పడంతోనే వరుణ్ ‌తేజ్‌ని ఇంప్రెస్ చేశాడట ప్రవీణ్ సత్తారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కథ విషయంలో వరుణ్‌ని పుష్ చేశారట. దాంతో, ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయ్. 

అవుట్ పుట్ బాగా వస్తోందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ అదిరిపోయే మేకోవర్‌తో కనిపించనున్నాడట.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com