దేశంలో బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది: తోట చంద్రశేఖర్
- May 05, 2023
అమరావతి: ఏపిలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని బిఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ దేశంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని అన్నారు. ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని రికార్డు సమయంలో నిర్మించారని అన్నారు. దేశ చరిత్రను తిరగరాసే అనేక సందర్భాలకు బిఆర్ఎస్ కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు.
దేశ ప్రజల మధ్య బిజెపి మత విద్వేషాలను సృష్టిస్తోందని తోట చంద్రశేఖర్ విమర్శించారు. బిజెపిని ఎదుర్కోవడంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పూర్తిగా విఫలమయిందని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడగలిగే సత్తా, ధైర్యం కేవలం కెసిఆర్ కు మాత్రమే వున్నాయని చెప్పారు. ఏపీలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందన్నారు.
తాజా వార్తలు
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!