సినిమా రివ్యూ: ‘ఉగ్రం’.!
- May 05, 2023
అల్లరి నరేష్, మిర్నా మీనన్ జంటగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉగ్రం’. అల్లరి నరేష్ అంటే ఓ కామెడీ హీరో గుర్తుకొస్తాడు. మినిమమ్ గ్యారంటీ హీరోగా తనదైన అల్లరి కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్.
అయితే, అదే అల్లరితో బోర్ కొట్టించేయడంతో, మధ్యలో కొన్నాళ్లు నరేష్ కెరీర్ డల్‌గా మారింది. దాంతో, పంథా మార్చేశాడు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. తనలోని నటుడిని బాగా పదును పెట్టాడు. ఆ క్రమంలోనే ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ వంటి సినిమాలొచ్చాయ్ నరేష్ నుంచి. ఫలితం పక్కన పెడితే, ఆయా సినిమాలతో నరేష్ తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేశాడు. ఇక అదే కంటిన్యూ చేస్తూ సీరియస్ యాక్షన్ హీరోగా మరోసారి దర్శనమిచ్చాడు ‘ఉగ్రం’ సినిమా కోసం. మరి, ఈ సినిమా నరేష్‌లోని యాక్షన్ హీరోని ఎలా ఎలివేట్ చేసిందన్నది తెలియాలంటే ‘ఉగ్రం’ కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
శివ కుమార్ (అల్లరి నరేష్) ఓ సీరియస్ అండ్ సిన్సియర్ పోలీసాఫీసర్. సిటీలో పెరిగిపోయిన హ్యూమన్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిగా బాధ్యతలు చేపడతాడు. ఓ ముఠా వేదికగా ఈ హ్యూమన్ ట్రాఫిక్ పెద్ద మాఫియా రన్ అవుతుంటుంది. చాలా మంది ఆడపిల్లలు, మహిళలు ఈ మాఫియా చెరలో చిక్కి, మాయమవుతూ వుంటారు. ఈ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో శివ కుమార్ తన భార్య, పిల్లల్ని కూడా మిస్ చేసుకోవల్సి వస్తుంది. మరి, తన భార్య, పిల్లలతో పాటూ, మిగిలిన ఆడపిల్లల్ని శివ కుమార్ ఎలా కనుగొన్నాడు.? మరోవైపు సీరియస్ కాప్‌గానే కాకుండా, శివ కుమార్‌కి ఊహించని ఓ బ్యాక్ గ్రౌండ్ వుంటుంది. అదేంటీ.? అసలు ఆడపిల్లల మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు శివ కుమార్ ఏం చేశాడు.? అనేది తెలియాలంటే ‘ఉగ్రం’ ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
సినిమా అంతా వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. తన భుజాలపైనే మొత్తం మోశాడు అల్లరి నరేష్ ఈ సినిమాని. కామెడీ జోనర్ హీరో అనే తలంపు ఎక్కడా కూడా కనిపించకుండా చేశాడు సినిమా చూస్తున్నంత సేపూ నరేష్. ఆ ట్రాన్స్‌ఫామేషన్‌కి మెచ్చుకోకుండా వుండలేం. ఇక, హీరోయిన్ మిర్నా మీనన్‌కి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ, వున్నంతలో ఫర్వాలేదనిపిస్తుంది. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
దర్శకుడు కనక మేడల ఎంచుకున్న సబ్జెక్ట్ కొత్తగా వుంది. అయితే, కథనాన్ని రొటీన్‌గా నడిపించేశాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ఓ మిస్టరీ యాక్షన్ డ్రామాకి వుండాల్సిన థిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్‌లు, ట్విస్టులు అన్నీ ఈ సినిమాలో వున్నాయ్. కానీ, ఇంకా బాగా హ్యాండిల్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. హీరోకి ‘కేజీఎఫ్’ రేంజ్‌లో ఇచ్చిన ఎలివేషన్లు బాగున్నాయ్. అయితే, అక్కడక్కడా అవసరం లేకున్నా ఎలివేషన్లతో విసిగించినట్లనిపిస్తుంది.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకి తగ్గట్లుగా వుంది. పాటలు పెద్దగా గుర్తుండవ్. ఎడిటింగ్‌కి కాస్త ఎక్కువే కత్తెర వేయాల్సి వుంటే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
నరేష్ పర్‌ఫామెన్స్,
యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్స్..
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా పేలవంగా సాగిన సన్నివేశాలు,
అనవసరం అనిపించిన కొన్ని ఎలివేషన్లు..
చివరిగా:
యాక్షన్ హీరోగా తనలోని ‘ఉగ్రం’ చూపించాడు అల్లరి నరేష్. ఈ సినిమాతో తన అల్లరికి చెల్లు చీటీ పాడేసినట్లయ్యింది. అంతలా శివ కుమార్ అనే పోలీసాఫీసర్ పాత్రకు సీరియస్‌నెస్ అద్దేశాడు అల్లరి నరేష్.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!