కోవిడ్19 గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఎత్తివేసిన WHO

- May 05, 2023 , by Maagulf
కోవిడ్19 గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఎత్తివేసిన WHO

జెనీవా: గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కారణంగా విధించిన హెల్త్ ఎమర్జెన్సీని తొలగిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ కమిటీ గురువారం సమావేశమై కోవిడ్19 వ్యాప్తితో విధించిన హెల్త్ ఎమర్జెన్సీని తొలగించవచ్చు అని అభిప్రాయపడింది. ఈ మేరకు శుక్రవారం కోవిడ్19 గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ముగిసింది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 

‘గడిచిన సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. వ్యాక్సిన్ ద్వారా ప్రజల రోగనిరోధక శక్తి పెరిగింది. అదే సమయంలో కరోనా మరణాలు తగ్గాయి. దాంతో వైద్య వ్యవస్థపై కాస్త ఒత్తిడి తగ్గింది. చాలా దేశాలు కరోనా నిబంధనల్ని ఎత్తివేశాయి. దాంతో మనం మళ్లీ గతంలో మాదిరిగా యథాతథంగా జీవించేందుకు అవకాశం కలిగింది అంటూ’ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయస్ ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ కమిటీ నిర్ణయాలను వరుస ట్వీట్లలో డబ్ల్యూహెచ్ఓ అఫీషియల్ అకౌంట్లో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com