21కి పెరిగిన కేరళ బోటు ప్రమాద మృతుల సంఖ్య.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

- May 08, 2023 , by Maagulf
21కి పెరిగిన కేరళ బోటు ప్రమాద మృతుల సంఖ్య.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

కేరళలో ఆదివారం రాత్రి జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ప్రాథమికంగా 9 మంది మరణించినట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 21కి చేరింది.

కేరళలోని మలప్పురం జిల్లా తానూర్‌లో టూరిస్టు బోటు బోల్తాపడిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. గల్లంతయిన వారి కోసం గజ ఈతగాళ్లతో సముద్రంలో గాలించారు.

ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 21 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరిందని కేరళ మంత్రి వీ.అబ్ధుర్ రెహ్మాన్ తెలిపారు. పర్యాటకులతో కూడిన ఈ హౌస్ బోట్ బోల్తా పడడంతో విషాదచాయలు అలుముకున్నాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.

ఘటన జరిగిన సమయంలో బోటులో 40 మంది వరకు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువల్తిరామ్ బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బోటును ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com