'హైదరాబాద్ లవ్‌స్టోరీ'.
- May 10, 2016
'అలా ఎలా' చిత్రంతో యువతను ఆకట్టుకున్న కథానాయకుడు రాహుల్ రవీంద్రన్. ఆయన తాజాగా నటించిన చిత్రం 'హైదరాబాద్ లవ్‌స్టోరీ'. ఎస్.పద్మజ సమర్పణలో ఎస్‌ఎన్‌ఆర్ ఫిల్మ్స్ పతాకంపై రాజ్ సత్య దర్శకత్వంలో ఎస్.ఎన్ రెడ్డి నిర్మించారు. రేష్మీ మీనన్, జియా కథానాయికలు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది.నిర్మాత సి.కల్యాణ్ చిత్రబృందానికి ప్లాటినం డిస్క్ షీల్డ్‌లను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ''నేను, ఎస్.ఎన్ రెడ్డి కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాం. ఇప్పుడు ఇద్దరం సినిమా రంగంలోకి వచ్చేశాం. ట్రైలర్‌లో దర్శకుడి ప్రతిభ కనిపిస్తోంది. రాహుల్‌కు ఈ చిత్రం మంచి బ్రేక్ అవ్వాలి'' అని ఆకాంక్షించారు. ''ఈ చిత్రం నాకు మంచి అనుభవం. క్వాలిటీ విషయంలో ఎస్.ఎన్ రెడ్డిగారు ఎక్కడా రాజీ పడలేదు.జూన్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు. నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకుడు రాజ్ సత్య, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: బివి అమర్‌నాథ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నంటి, సహ నిర్మాత: ఎస్. శ్రీలక్ష్మి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







