మూడు నెలల్లో ఐకానిక్ డెయిరా క్లాక్‌టవర్ రౌండ్అబౌట్ మేక్ఓవర్
- May 13, 2023
దుబాయ్: దుబాయ్ మునిసిపాలిటీ వాటర్ ఫౌంటెన్ డిజైన్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు పచ్చదనం, రంగురంగుల లైటింగ్‌తో ఐకానిక్ డీరా క్లాక్‌టవర్ రౌండ్అబౌట్ పునరుద్ధరణను ప్రారంభించింది. దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ దావూద్ అల్ హజ్రీ మాట్లాడుతూ.. దుబాయ్ చారిత్రక, నిర్మాణ ఆనవాళ్లను భవిష్యత్ తరాలకు భద్రపరచడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశమన్నారు. దుబాయ్ మునిసిపాలిటీ జనరల్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, ఇంజనీర్ జబీర్ అల్ అలీ మాట్లాడుతూ.. మూడు నెలల పాటు సాగే ఈ ప్రాజెక్ట్‌లో డెకరేటివ్ గార్డెనింగ్, పాత వాటి స్థానంలో మల్టీకలర్ లైటింగ్, ఫౌంటెన్‌ను పునరుద్ధరించడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఆధునిక డిజైన్‌తో ల్యాండ్‌మార్క్ చారిత్రక లేదా నిర్మాణ ప్రాముఖ్యత చెక్కుచెదరకుండా ఉండేలా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.
డీరా క్లాక్‌టవర్ రౌండ్అబౌట్ ఒక ముఖ్యమైన చారిత్రక, నిర్మాణ మైలురాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత అద్భుతమైన క్లాక్ టవర్లలో ఒకటి.1963లో నిర్మించిన ఈ క్లాక్‌టవర్ కు ఓ చరిత్ర ఉంది. ఇది డీరా మరియు బుర్ దుబాయ్ మధ్య మొదటి భూమార్గం. ఉమ్ హురైర్ స్ట్రీట్ మరియు అల్ మక్తూమ్ స్ట్రీట్ కూడలిలో ఉంటుంది. ఇది దుబాయ్ ఎమిరేట్‌లో అత్యంత ముఖ్యమైన కూడలిలో ఒకటి. దుబాయ్-అబుదాబి రహదారి నిర్మాణానికి ముందు.. ఇది దుబాయ్‌కి వెళ్లే ప్రధాన రహదారులకు జంక్షన్ ప్రారంభ కేంద్రంగా పనిచేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







