మూడు నెలల్లో ఐకానిక్ డెయిరా క్లాక్‌టవర్ రౌండ్అబౌట్ మేక్ఓవర్

- May 13, 2023 , by Maagulf
మూడు నెలల్లో ఐకానిక్ డెయిరా క్లాక్‌టవర్ రౌండ్అబౌట్ మేక్ఓవర్

దుబాయ్: దుబాయ్ మునిసిపాలిటీ వాటర్ ఫౌంటెన్ డిజైన్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు పచ్చదనం, రంగురంగుల లైటింగ్‌తో ఐకానిక్ డీరా క్లాక్‌టవర్ రౌండ్‌అబౌట్‌ పునరుద్ధరణను ప్రారంభించింది. దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ దావూద్ అల్ హజ్రీ మాట్లాడుతూ.. దుబాయ్ చారిత్రక, నిర్మాణ ఆనవాళ్లను భవిష్యత్ తరాలకు భద్రపరచడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశమన్నారు. దుబాయ్ మునిసిపాలిటీ జనరల్ మెయింటెనెన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్, ఇంజనీర్ జబీర్ అల్ అలీ మాట్లాడుతూ.. మూడు నెలల పాటు సాగే ఈ ప్రాజెక్ట్‌లో డెకరేటివ్ గార్డెనింగ్, పాత వాటి స్థానంలో మల్టీకలర్ లైటింగ్‌, ఫౌంటెన్‌ను పునరుద్ధరించడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఆధునిక డిజైన్‌తో ల్యాండ్‌మార్క్ చారిత్రక లేదా నిర్మాణ ప్రాముఖ్యత చెక్కుచెదరకుండా ఉండేలా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.
డీరా క్లాక్‌టవర్ రౌండ్‌అబౌట్ ఒక ముఖ్యమైన చారిత్రక, నిర్మాణ మైలురాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత అద్భుతమైన క్లాక్ టవర్‌లలో ఒకటి.1963లో నిర్మించిన ఈ క్లాక్‌టవర్ కు ఓ చరిత్ర ఉంది. ఇది డీరా మరియు బుర్ దుబాయ్ మధ్య మొదటి భూమార్గం. ఉమ్ హురైర్ స్ట్రీట్ మరియు అల్ మక్తూమ్ స్ట్రీట్ కూడలిలో ఉంటుంది. ఇది దుబాయ్ ఎమిరేట్లో అత్యంత ముఖ్యమైన కూడలిలో ఒకటి. దుబాయ్-అబుదాబి రహదారి నిర్మాణానికి ముందు.. ఇది దుబాయ్‌కి వెళ్లే ప్రధాన రహదారులకు జంక్షన్ ప్రారంభ కేంద్రంగా పనిచేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com