యువకుడి మరణానికి కారణమైన డ్రైవర్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

- May 17, 2023 , by Maagulf
యువకుడి మరణానికి కారణమైన డ్రైవర్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

బహ్రెయిన్ : యువకుడి మరణానికి కారణమైన బహ్రెయిన్ డ్రైవర్‌ను లోయర్ క్రిమినల్ కోర్ట్ హత్య ఆరోపణల నుండి నిర్దోషిగా ప్రకటించింది. అర్థరాత్రి ఫుట్‌బాల్ ఆడుతున్న యువకుడు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతోనే యాక్సిడెంట్ అయిందని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు వాహనాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడని కోర్టు తెలిపింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.  అనంతరం యువకుడి మరణానికి కారణమయ్యాడని వాహన డ్రైవర్ పై అభియోగాలు మోపారు. అయితే, యువకుడు ఆకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం, అక్కడంతా చీకటిగా ఉన్నదని, పైగా మరణించిన యువకుడు నల్ల టీ-షర్టు ధరించాడని.. ఇందులో ప్రతివాది తప్పు లేదని అతని లాయర్ నిరూపించగలిగాడు. మృత్యువాత పడిన యువకుడు తనకు తెలియకుండానే ఏదైనా వాహనం వస్తున్నాయో లేదో చూసుకోకుండా రోడ్డుపైకి వచ్చాడని కూడా ఈ ఘటన టెక్నికల్ రిపోర్ట్ పేర్కొంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com