జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
- May 17, 2023
సుప్రీంకోర్టు లో జగన్ సర్కార్‌కు షాక్ తగిలింది. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. చిత్తూరు జిల్లాలోని ఆవులపల్లి రిజర్వాయర్‌కు పర్యావరణ అనుమతిని ఎన్జీటీ కొట్టి వేసింది. దీంతో ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాలో ముందుగా రూ.25 కోట్లను వెంటనే కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. జస్జిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.100 కోట్ల జరిమానా విధించవచ్చా? అన్న అంశంపై మాత్రం పాక్షికంగా సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణ న్యాయస్థానం అక్టోబర్కు వాయిదా వేసింది.
ఎన్జీటీ రూ.100 కోట్లు జరిమానా విధించడం చట్టబద్ధం కాదని ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రాజెక్టులను మీకు అనుకూలంగా విడగొట్టడం ఎలా చట్టబద్ధమని సుప్రీం ప్రశ్నించింది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని.. రూ.100 కోట్ల జరిమానా భారం అవుతుందని రోహత్గీ వాదించారు. రూ.100 కోట్ల జరిమానా నిలుపుదల చేయాలని కోర్టును ముకుల్ రోహత్గీ కోరారు. దీంతో ప్రస్తుతానికి రూ.25 కోట్లు కృష్ణా బోర్డులో జమ చేయాల్సిందేనని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్‌లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్‌లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!