NBK 108 కోసం హనీ రోజ్‌ను దించబోతున్నారా.?
- May 17, 2023
‘వీర సింహారెడ్డి’ సినిమాలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్‌గా నటించినప్పటికీ మరో హీరోయిన్‌గా నటించిన హనీ రోజ్‌కి మంచి క్రేజ్ వచ్చింది.
ఈ సినిమాతో హనీరోజ్ బాగా పాపులర్ అయ్యింది. అయితే, అవకాశాలు రాలేదు కానీ, సినిమా ప్రమోషన్లలో హనీ రోజ్ చాలా యాక్టివ్‌గా పాల్గొనడం, అదే టైమ్‌లో శృతి హాసన్ పెద్దగా ప్రమోషన్లకు హాజరు కాకపోవడంతో, హనీ రోజ్ పేరు మార్మోగిపోయింది.
బాలయ్య హీరోయినా.? మజాకానా.? అనే రేంజ్‌లో పేరు తెచ్చుకుంది హనీ రోజ్. ఇప్పుడు తన కొత్త సినిమాలో హనీ రోజ్‌కి ఇంకో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట బాలయ్య.
అనిల్ రావిపూడితో బాలయ్య నటిస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల బాలయ్యకు కూతురు పాత్రలో కనిపించనుంది.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ అదిరిపోయే మాస్ మసాలా స్పెషల్ సాంగ్ కోసం హనీ రోజ్‌ని ప్రిఫర్ చేస్తున్నాడట. దాదాపు ఓకే అయినట్లు తెలుస్తోంది. అఫీషియల్‌గా క్లారిటీ రావాల్సి వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







