సౌదీ అరేబియాలో గృహ కార్మికులకు ఆరోగ్య బీమా
- May 17, 2023
జెడ్డా: గృహ కార్మికులకు ఆరోగ్య బీమా నిబంధనలను వర్తింపజేయడానికి సౌదీ అరేబియా కేబినెట్ ఆమోదం తెలిపింది. కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అధ్యక్షతన.. అనేక సంస్థల సభ్యత్వంతో ఏర్పడిన కమిటీ ద్వారా రూపొందిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షత వహించారు. క్రిమినల్ నెట్‌వర్క్‌ల కార్యకలాపాలను ఎదుర్కోవడం, దేశ ప్రయోజనాలను కాపాడటం కోసం రాజ్యంలోకి అక్రమ రవాణాను నిరోధించడం వంటి మాదకద్రవ్యాల వ్యతిరేక భద్రతా ప్రచారం స్పష్టమైన ఫలితాలను కేబినెట్ ప్రశంసించింది. టీచింగ్, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వృత్తికి సంబంధించిన లైసెన్స్‌లను జారీ చేసే అధికారాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి విద్యా మంత్రిత్వ శాఖకు బదిలీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరీ తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి