భోజనం తర్వాత నిద్ర.! ఆరోగ్యం జర భద్రం సుమా.!
- May 17, 2023
పుష్టిగా భోజనం చేశాకా, సుష్టిగా ఓ కునుకు లాగించేయడం చాలా మందికి అలవాటుగా వుంటుంది. కానీ, ఆ అలవాటు ఆరోగ్యానికి అత్యంత చేటుగా ఆహార నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించడం వల్ల జీవక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఆహార అణువుల జీర్ణ ప్రక్రియ విచ్చిన్నం కావడంతో, అజీర్తి సమస్యలు తలెతుత్తుతాయ్.
ఇదే అలవాటుగా మారితే, జీర్ణ ప్రక్రియ క్రమ క్రమంగా మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే భోజనం తర్వాత పండ్లు తినడం కూడా మంచిది కాదంటున్నారు. భోజనానికి రెండు గంటలు ముందు అయినా, రెండు గంటల తర్వాత అయినా పండ్లను సేవిస్తే మంచిది.
భోజనం తర్వాత ధూమపానం చేయడం, టీ, కాఫీలు తాగడం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
సో, ఇలాంటి అలవాట్లు వున్న వారు ఆరోగ్యం మీద ఏ మాత్రం శ్రద్ధ వున్నా వాటికి దూరంగా వుంటే మంచిదని నిఫుణుల సూచన.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







