PIRLS అధ్యయనం: రాణించిన బహ్రెయిన్ విద్యార్థులు
- May 17, 2023
బహ్రెయిన్ : ఇంటర్నేషనల్ రీడింగ్ లిటరసీ స్టడీలో (PIRLS 2021) బహ్రెయిన్ విద్యార్థులు రాణించారు. వారి విద్యా సగటు 458 పాయింట్లకు పెరిగింది. ఇది 2016లో మునుపటి ఫలితాలతో పోలిస్తే 12 పాయింట్ల పెరగడం గమనార్హం. కింగ్డమ్లోని 119 ప్రభుత్వ పాఠశాలలు, 67 ప్రైవేట్ పాఠశాలల నుండి 5,251 మంది నాల్గవ తరగతి విద్యార్థులు పాల్గొన్న ఒక అధ్యయనంలో బహ్రెయిన్ మూడవ అరబ్ దేశంగా.. ప్రపంచంలో 45వ స్థానంలో నిలిచింది. ఈ అంతర్జాతీయ పరీక్షలో బహ్రెయిన్ విద్యార్థులు సాధించిన ఈ విశిష్ట ఫలితాల పట్ల విద్యాశాఖ మంత్రి డాక్టర్ మహమ్మద్ బిన్ ముబారక్ జుమా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరబిక్, ఇంగ్లీషులో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలకు సంబంధించిన విద్యా సేవలను అన్ని స్థాయిలలో అభివృద్ధి చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలను మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







