ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి హీరో ఉదయ్ కిరణ్ తరలింపు
- May 11, 2016
పబ్‌పై దాడి కేసులో అరెస్టయిన 'ఫేస్‌బుక్' సినిమా హీరో ఉదయ్‌కిరణ్‌ను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో.. వెంటనే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని జడ్జి ఆదేశించారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఉదయ్‌కిరణ్ బుధవారం కోర్టులో విచారణకు హాజరయ్యాడు. అయితే విచారణ సందర్భంగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా అతడు రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నాడని జైలు అధికారులు తెలిపారు. దాంతో వెంటనే అతడిని మానసిక వైద్యులకు చూపించి.. వారి నుంచి సమగ్ర నివేదిక తీసుకోవాలని జడ్జి ఆదేశించారు.
తనను పబ్‌లోకి అనుమతించడం లేదన్న ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి, లోపల నగ్నంగా నృత్యాలు చేసిన కేసులో ఉదయ్‌కిరణ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. మార్చి 23వ తేదీ రాత్రి అతడు ఓవర్ ద మూన్ పబ్‌కి వెళ్లగా.. గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అనుమతించలేదు. దీంతో అద్దాలు పగలగొట్టి కుర్చీలు విసిరేసి బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్‌లో బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఉదయ్‌కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









