సౌదీ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ యూనిట్లు
- May 26, 2023
రియాద్: సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రధాన కార్యాలయంలో పర్యాటకం కోసం కొత్త ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అటార్నీ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సౌద్ అల్-ముజాబ్.. రాజ్యంలో అంతర్జాతీయ, ప్రాంతీయ విమానాశ్రయాలలో టూరిజం ప్రాసిక్యూషన్ ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులను జారీ చేశారు.
కొత్త ప్రాసిక్యూషన్ వ్యవస్థ, విజయవంతమైన న్యాయం సూత్రాలకు అనుగుణంగా.. పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా, పర్యాటకులు, సందర్శకుల కేసుల ప్రక్రియలను తక్కువ సమయంలో పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. టూరిజం ప్రాసిక్యూషన్ నేరుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో అనుసంధానించబడి, అన్ని చట్టపరమైన విధానాలు, చర్యలను తీసుకుంటుంది. సిస్టమ్‌కు అనుగుణంగా కేసులను పరిష్కరిస్తుంది. పర్యాటకులు వారికి కేటాయించిన వారి హక్కులు, హామీలను ఆస్వాదించేలా 24 గంటలూ పని చేస్తుంది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని అర్హత కలిగిన సభ్యుల కేడర్, శిక్షణ పొందిన అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్న సహాయకులు అత్యున్నత స్థాయి చట్టపరమైన సామర్థ్యం, అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలకు అనుగుణంగా కొత్త యూనిట్లలో పని చేస్తారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







