బహ్రెయిన్ మెట్రో మొదటి దశ: 29 కి.మీ, 20 స్టేషన్లు
- May 26, 2023బహ్రెయిన్ : బహ్రెయిన్ మెట్రో మొదటి దశ 20 స్టేషన్లలో నడుస్తుందని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రవాణా, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం.. బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా 109 కి.మీ. పరిధిలో రాబోతుంది. ప్రాజెక్టు మొదటి దశలో అత్యంత ముఖ్యమైన ప్రదేశాల గుండా సాగే 29 కి.మీ పొడవు (20 స్టేషన్లు) గల మార్గాన్ని ప్రారంభించారు. వీటిలో ముహర్రాక్, కింగ్ ఫైసల్ హైవే, జుఫైర్, డిప్లొమాటిక్ ఏరియా, సీఫ్ డిస్ట్రిక్ట్, సల్మానియా, అధారీ మరియు ఇసా టౌన్ ఉన్నాయి. బహ్రెయిన్ మెట్రో మొదటి 35 సంవత్సరాల ఒప్పందం కోసం ప్రైవేట్ రంగ సహకారంతో నిర్మించారు. బహ్రెయిన్ రాజ్యంలో బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్ అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ప్రాజెక్టులలో ఒకటి అని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్ ద్వారా రవాణా, రద్దీని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ప్రాజెక్ట్ ను రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..