మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

- May 27, 2023 , by Maagulf
మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

హైదరాబాద్: వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా మాదాపూర్ హైటెక్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులచే ప్రజలకు అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం పై  అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమంతరావు-ట్రాఫిక్ ACP ,మాదాపూర్ SI అవినాష్ (Law & Order ) మరియు మెడికవర్ హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రంజిత్ , డాక్టర్ విక్రమ్ కిషోర్ రెడ్డి, గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కైలాసం మరియు ఎమర్జెన్సీ విభాగం అధిపతి డాక్టర్ విక్రమ్ మరియు సెంటర్ హెడ్  డాక్టర్ మాత ప్రసాద్ గారు పాల్గొన్నారు.

అనంతరం ముఖ్య అతిధి హనుమంతరావు-ట్రాఫిక్ ACP మాట్లాడుతూ భద్రత అనేది ప్రతి వ్యక్తితో మొదలయ్యే సమిష్టి బాధ్యత. ఈ మధ్యకాలంలో చాలావార్తల్లో వింటూనే ఉన్నాం. రోడ్ మీద వెళ్తూ, అటుకుంటూ లేక డాన్స్ చేస్తూ చనిపోవడం గమనిస్తూనే ఉన్నాం. అటువంటి అత్యవసర సమయాల్లో ఈ విధంగా స్పందించాలో దాని గురించి మనకు అవగాహన కల్పించడం ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ మరియు ట్రామా కేర్, మన స్వంత జీవితాలను మాత్రమే కాకుండా మన తోటి వారి ప్రాణాలను కూడా మనం రక్షించగలం అని అన్నారు. అత్యవసర ప్రథమ చికిత్స మరియు CPR వంటివి నేర్చుకోవడానికి వ్యక్తులను ప్రోత్సహించడం మరియు అవగాహనా కల్పించడం ఎంతో ముఖ్యం అన్నారు. ఇటువంటి ప్రజలకు అవగాహనా కలిగించే కార్యక్రమం నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్ వారిని అభినందించారు.

డాక్టర్ రంజిత్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో, ప్రతి సెకను గణించబడుతుందని మరియు మనం చేసే సహాయం వల్ల ఒకరి ప్రాణం మరియు తనమీద అదరపడినవారికి ఎంతో మేలు చేసినవారం అవుతాం. ఇది ప్రకృతి వైపరీత్యమైనా, తీవ్రమైన ప్రమాదం అయినా ప్రతిస్పందించడానికి జ్ఞానం, నైపుణ్యాలు మరియు వనరులను కలిగి ఉండటం వలన ప్రాణాలను రక్షించడంలో మరియు హానిని తగ్గించడంలో కీలకమైన మార్పు ఉంటుంది. మొదటి గంటలో (గోల్డెన్ అవర్) చేసిన వైద్యం వల్ల చాలా వరకు బ్రతికే అవకాశం ఉంటుంది అని అన్నారు.
 
మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ కైలాసం మాట్లాడుతూ ఆకస్మిక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, సెప్సిస్ పాలీట్రామా అనేది ఎవరికైనా మొదటి గంటలో జరిగే చికిత్స గోల్డెన్ అవర్. ఆ సమయంలో ఎంత త్వరగా పేషెంట్ ని దగ్గరలోని  హాస్పిటల్ కి తీసుకోని వేళ్తే చాలా మంది బ్రతికే అవకాశం ఉంటుంది. అలా మేము చాలా మంది ప్రాణాలను రక్షించగలము. ఎవరైనా అడ్మిట్ అయినట్లయితే వారి ఆసుపత్రి బస తక్కువగా ఉంటుంది మరియు వారికి సరైన వైద్యం అందటం వల్ల వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది మరియు వారికి ఖర్చు కూడా తక్కువ అవుతుంది అని అన్నారు. 

మాదాపూర్ SI అవినాష్ బాబు (Law & Order ) మాట్లాడుతూ  ప్రపంచ ఎమర్జెన్సీ డే వంటి కార్యక్రమాల ద్వారా, అత్యవసర సమయాల్లో చురుకైన ప్రతిస్పందనదారులుగా మారడానికి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అని  అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com