‘2018’ వరదలు కాదు, వసూళ్ల సునామీ బాస్.!
- May 29, 2023
అదో మలయాళ చిత్రం. ‘2018’ అనే టైటిల్‌తో రూపొందింది. 2018లో కేరళను భారీ వరదలు ముంచెత్తేసిన సంగతి తెలిసిందే. దేశ నలుమూలల నుంచీ కేరళకు సహాయ సహకారాలు అందించారు ఈ టైమ్‌లో.
ఎవరికి తోచిన రీతిలో వారు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా ముందుకొచ్చారు. అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ‘2018’. అప్పటి వరదల్లో చిక్కుకున్న నాలుగు కుటుంబాల మధ్య నడిచిన కథతో ఎంతో హృద్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
వరదల్లో చిక్కుకుని ఆఖరి గడియల్లో విలవిల్లాడుతున్న ఆయా కుటుంబాల ఎమోషన్ని క్యారీ చేస్తూనే ఆ గాధని మన కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ ఈ సినిమాలో.
ఈ టేకింగ్కి అందరూ ఫిదా అయ్యారు. మలయాళంలో అత్యంత తక్కువ బడ్జెట్ 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృస్టించింది.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. యూనిక్ సబ్జెక్ట్ కావడంతో, ఈ సినిమాకి ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. తద్వారా ఇక్కడ కూడా ‘2018’ రికార్డు వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







