తృణధాన్యాల బాక్సుల్లో 7 కిలోల డ్రగ్స్..ఎయిర్‌పోర్టులో చిక్కిన వ్యక్తి
- May 31, 2023
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (డిఎక్స్‌బి)లో 7.06 కిలోల గంజాయితో ఒక ఆసియా యాత్రికుడు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. అతను ప్రముఖ తృణధాన్యాల బ్రాండ్‌కు చెందిన బాక్సుల్లో డ్రగ్స్‌ను దాచి తరలిస్తున్నట్లు గుర్తించినట్లు దుబాయ్ కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని, స్మగ్లర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
దుబాయ్ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ప్యాసింజర్ కార్యకలాపాల సీనియర్ డైరెక్టర్ ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ.. కొందరు మాదకద్రవ్యాలను సౌందర్య సాధనాలలో దాచిపెడతారని చెప్పారు. మరికొందరు బట్టలలో దాచుతారు. దీంతోపాటు కాలానుగుణ పండ్లు, సుగంధ ద్రవ్యాల సంచులలో వాటిని దాచి తరలిస్తారు. అయితే, కస్టమ్స్ అధికారులు హైటెక్ తనిఖీ పరికరాలను ఉపయోగిస్తున్నారని, దీంతో డ్రగ్స్, ఇతర నిషిద్ధ వస్తువులను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలను విఫలం చేయడానికి వీలవుతుందన్నారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









