ప్రబాస్ సినిమాలో లోక నాయకుడా.! నిజమేనా.?
- May 31, 2023ప్రబాస్ సినిమా అంటే చాలు.. అన్ని రకాలా బిగ్ స్కేల్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు మేకర్లు. నిజానికి ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ మార్కెట్ అయితే భారీగా పెరిగిపోయింది. కానీ, ఆ మార్కెట్‌ని రీచ్ అవ్వడంలో ఎంత మేర సక్సెస్ అవుతున్నాడు ప్రబాస్ అనేది చూస్తున్న సంగతే.
అయినా కానీ, మేకర్లు తగ్గడం లేదు. బడ్జెట్‌తో పాటూ, కాస్టింగ్ కూడా కాస్ట్లీగానే వుంటోంది. ఇక, ప్రస్తుతం ప్రబాస్ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కె’ అనే ప్యాన్ ఇండియా మూవీ వున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్ వంటి అగ్ర నటులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ గాసిప్ బిగ్ బ్రేకింగ్‌లా చక్కర్లు కొడుతోంది. లోక నాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారన్నది ఆ గాసిప్ సారాంశం.
‘విక్రమ్’ సినిమాతో కమల్ హాసన్ ఈ వయసులోనూ తన సత్తా ఏంటో చూపించారు. అలాంటి కమల్ హాసన్, ప్రబాస్ సినిమాలో కనిపిస్తాడంటే, ఖచ్చితంగా సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తాయ్. కేవలం ఇది సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు స్ర్పెడ్ అవుతున్న గాసిప్పా.? లేదంటే నిజంగానే విశ్వ నటుడు కమల్ హాసన్, ‘ప్రాజెక్ట్ కె’లో కనిపిస్తాడా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?