మీనా లో మొదటి ఆరోగ్యకరమైన ద్వీపంగా మసిరా

- June 01, 2023 , by Maagulf
మీనా లో మొదటి ఆరోగ్యకరమైన ద్వీపంగా మసిరా

మస్కట్: మిడిల్ ఈస్ట్ రీజియన్‌లోని మొట్టమొదటి ఆరోగ్యకరమైన ద్వీపంగా మసీరా ద్వీపానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. జూన్ 4న మసిరా ద్వీపంలో జరిగే అధికారిక వేడుకలో ఈ మేరకు WHO ఈ ప్రమాణపత్రాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందజేస్తుందని తెలిపింది. గౌరవనీయులైన డాక్టర్ హిలాల్ బిన్ అలీ బిన్ హిలాల్ అల్-సబ్తి - ఆరోగ్య మంత్రి - అలాగే సౌత్ అల్ షర్కియా, గవర్నర్, హిస్ ఎక్సలెన్సీ జాన్ జబ్బూర్ సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. ఒమన్ సుల్తానేట్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అనేక మంది ప్రముఖులు, షురా, మున్సిపల్ కౌన్సిల్‌ల సభ్యులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com