యూఏఈ లో నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరిన పెట్రోల్ ధరలు

- June 01, 2023 , by Maagulf
యూఏఈ లో నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరిన పెట్రోల్ ధరలు

యూఏఈ: పెట్రోల్ ధరలు నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరాయి. బుధవారం సూపర్ 98, స్పెషల్ 95 మరియు E-ప్లస్ మూడు వేరియంట్‌లలో జూన్ నెలలో లీటరుకు 21 ఫిల్‌ల చొప్పున రిటైల్ పెట్రోల్ ధరలను ఇంధన ధరల కమిటీ తగ్గించింది. దీంతో పెట్రోల్ ధరలు నాలుగు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇంధన ధరల ఫాలో-అప్ కమిటీ సూపర్ 98 మరియు స్పెషల్ 95 రేట్లను 6.6 శాతం, ఇ-ప్లస్ 7 శాతం తగ్గించింది.

సూపర్ 98 పెట్రోల్ ధర జూన్‌లో లీటరుకు Dh2.95 (మే నెలలో Dh3.16)కు తగ్గింది. స్పెషల్ 95 ధర లీటరుకు Dh2.84కి(మేలో Dh3.05) తగ్గింది. ఈ-ప్లస్ 91 లీటర్‌కు 2.97 దిర్హామ్‌ల నుండి 2.76 దిర్హామ్‌లకు తగ్గించారు.  డీజిల్ ధర లీటర్‌కు 2.91 దిర్హామ్‌ల నుండి 2.68 దిర్హాలకు తగ్గిస్తూ ఇంధన ధరల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.  

చైనీస్ ఆర్థిక గణాంకాలు ఊహించిన దానికంటే బలహీనంగా ఉండటంతో మే నెలలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒత్తిడికి గురయ్యాయి. బ్రెంట్ మరియు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) జూలై కాంట్రాక్టులు వరుసగా 7 శాతం మరియు 9 శాతం కంటే ఎక్కువ నెలవారీ క్షీణతకు దారితీశాయి. ఆగస్ట్ డెలివరీ కోసం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 15 సెంట్లు పడిపోయి $73.56కి చేరుకోగా, యూఏఈ కాలమానం ప్రకారం ఉదయం 10.56 గంటల సమయానికి WTI బ్యారెల్‌కి 14 సెంట్లు పడిపోయి $69.32కి చేరుకుంది. మంగళవారం రెండు బెంచ్‌మార్క్‌లు 4 శాతానికి పైగా పడిపోయాయి. చమురు ఉత్పత్తి చేసే Opec+  దేశాలు జూన్ 4న సమావేశమవుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com