మస్కట్ లో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు

- June 01, 2023 , by Maagulf
మస్కట్ లో ఎన్.టి.ఆర్ శతజయంతి ఉత్సవాలు

మస్కట్: తెలుగుజాతి ఆత్మగౌరవానికి వన్నె తెచ్చిన నటనా రాజకీయ దురంధురుడు....శకపురుషుడు... నందమూరి తారక రామారావు  శతజయంతి ఉత్సవాలు మరియు పల్నాటి పౌరుషానికి ప్రతీక కోడెల శివప్రసాద్ 75వ జయంతి  ఉత్సవాలు మస్కట్ లోని తెలుగు ప్రజలు ఇంటిల్లిపాది గా వచ్చి  ఎంతో కోలాహలంగా జరుపుకున్నారు. 

NRI ఒమన్ తెలుగుదేశం అధ్యక్షుడు మొహమ్మద్ ఇమామ్ మరియు ఇతర ముఖ్య కార్యవర్గ సభ్యులు సత్య శ్రీధర్, రాఘవేంద్ర, సీతారామయ్య, వాసుబాబు, కొడాలి కిరణ్ గార్లు జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రము ప్రారంభించగా, వక్తలు అన్నగారు తెలుగు వారి మేలు కోసం అహర్నిశలు శ్రమించిన వైనాన్ని వ్యక్తపరచగా,  మిగతా సభ్యులు, చిన్నారులు, ఆడపడుచులు అలనాటి ఎన్.టి.ఆర్  ఆణిముత్యాలాంటి పాటలకి నృత్యాలతో స్మరించుకున్నారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com