గురూజీ.! ‘సూపర్’ దెబ్బేసేశాడుగా.!
- June 01, 2023
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణ జీవించి వున్నప్పుడే ఆయన పుట్టినరోజుకు తన కొత్త సినిమా అప్డేట్ ఇస్తుండడం మహేష్ బాబుకి అలవాటు.
అందులో భాగంగానే ఈ ఏడాది తన తాజా మూవీ అప్డేట్ రిలీజ్ చేశాడు మహేష్ బాబు. ఉదయం రకరకాల స్టిల్స్, పోస్టర్లతో ఫ్యాన్స్‌ని హుషారెత్తించిన మహేష్ బాబు, సాయంత్రానికల్లా సినిమా టైటిల్ రిలీజ్ చేశారు.
దీంతో పాటూ, ఓ ఊర మాస్ డైలాగ్‌తో కూడిన వీడియో కూడా రిలీజ్ చేశారు. ‘గుంటూరు కారం’ అని ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయడమే అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల టైటిల్స్‌కి ఓ ప్రాధాన్యత వుంటుంది. అలాంటిది మహేష్ బాబు సినిమా కోసం ఇలాంటి టైటిల్ పెట్టాడేంటీ.? అన్న దానిపై చర్చ నడుస్తోంది. అస్సలు సంతృప్తికరంగా లేరు ఈ టైటిల్‌పై అభిమానులు.
పెద్ద దెబ్బే వేసేశాడుగా మహేష్ బాబుకి అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ఇలా ఏవీ శాటిస్ఫై చేయలేకపోయాయ్. మరి, సినిమాతో గురూజీ ఏం చేయబోతున్నాడో చూడాలి మరి. పూజా హెగ్దే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







