అప్పుడే ఆ వుద్దేశ్యం లేదంటోన్న మాధవీ లత.!
- June 01, 2023సెలబ్రిటీల పర్సనల్ విషయాలంటే ఎప్పుడూ సినీ జనాల్లో ఆసక్తి ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి విషయాలపై మరింత ఆత్రుత వుంటుంది. ఏ చిన్న అవకాశం చిక్కినా పెళ్లెప్పుడు.? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయ్ సెలబ్రిటీలకి.
తాజాగా ‘నచ్చావులే’ ముద్దుగుమ్మ మాధవీ లతకీ ఈ తరహా ప్రశ్న ఈ మధ్య తరచూ ఎదురవుతోందట. అందుకే కాస్త గుస్సా అయ్యింది. మళ్లీ మళ్లీ అలాంటి ప్రశ్న తన వద్దకు రాకుండా సమాధానమిచ్చింది.
అమ్మాయిల విషయంలో పెళ్లంటే అదో అపురూపమైన ఘట్టం. అందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధపడి వుండాలి. కానీ, తాను ప్రస్తుతం అందుకు సిద్ధంగా లేనని చెప్పుకొచ్చింది.
అన్ని రకాలా పెళ్లికి తాను సిద్ధంగా వున్నప్పుడు ఆ గుడ్ న్యూస్ ఖచ్చితంగా అందరికీ షేర్ చేస్తానని చెప్పింది.
ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కన్నా, ఎక్కువగా రాజకీయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. సోషల్ మీడియాలో పలు రాజకీయ అంశాల నేపథ్యంలో తనదైన స్టైల్లో స్పందిస్తూ వుంటుంది. తాజాగా పెళ్లి విషయంలో మాధవీ లత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?