కంటి చూపును మెరుగు పరుచుకోవాలంటే మీ డైట్లో వీటిని చేర్చుకోండి.!
- June 02, 2023ఒకప్పుడు నలభయ్యేళ్లు పైబడిన వారిలోనే కంటి సమస్యలు తలెత్తేవి. కానీ, ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే కంటి జబ్బులు తోడవుతున్నాయ్. అందుకు తీసుకునే ఆహారంలో వుండాల్సిన పోషకాలు సరిగా లేకపోవడం, మొబైల్ వాడకం, కంప్యూటర్ స్ర్కీనింగ్ ఎక్కువగా చూస్తుండడంతో పాటూ కాలుష్యం కూడా ఓ కారకమే.
అయితే, వాటన్నింటినీ మార్చడం సాధ్యం కాకపోయినా, వున్నంతలో కంటి చూపును మెరుగు చేసుకోవడానికి కనీసం కాపాడుకోవడానికి ప్రతీరోజూ తీసుకునే డైట్లో ఈ పదార్ధాలు వున్నాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకోండి అని సంబంధింత వైద్యులు సూచిస్తున్నారు.
క్యారెట్ తింటే కంటి చూపుకు ఇబ్బంది వుండదు అని తెలిసిన సంగతే. క్యారెట్‌తో పాటూ పాలకూర కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అలాగే బ్రొకోలీని పెద్దగా ఎవ్వరూ ఇష్టపడరు. కానీ, బ్రొకోలీలో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఉడికించిన చిలగడ దుంపలు, కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయ్. మాంసం కన్నా, చేపల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే శక్తి ఎక్కువగా వుంటుంది. అందుకే వారానికి ఓ సారైనా చేపలను మన మెనూలో చేర్చుకోవాలి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం