అంతన్నాడింతన్నాడే గంగరాజు.. ఎప్పటిలాగే తేల్చేశాడే.!
- June 02, 2023‘అహింస’ అంటూ తేజ లాంగ్ గ్యాప్ తర్వాత ఓ సినిమాతో రాబోతున్నాడు. తేజ సినిమాల్లో కొత్తగా చూపించడానికేముంటుంది. ఓ రైలు బండి, రక్తంతో నిండిపోయిన హీరో, హీరోయిన్‌తో అరుపులు, పైశాచికత్వం.. ఇదే కదా. అదే కనిపించింది ‘అహింస’ పోస్టర్లలోనూ.
సినిమాలోనూ అదే వుంది కొత్తగా ఇంకేం లేదు అని తాజాగా జనం తేల్చేశారు. దగ్గుబాటి రానా సోదరుడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేశాడు డైరెక్టర్ తేజ ఈ సినిమాతో.
సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన చేయాల్సిన ఓవరాక్షన్ అంతా చేసేశాడు. అంత చేసినా సినిమాని మాత్రం కాపాడలేకపోయాడు. ఫస్ట్ డే టాకే సుత్తి, చెత్త.. అని తేలిపోయింది. ఇక, ఈ సినిమాని ఆదుకునే నాధుడింకెవరు.?
ప్రమోషన్ల పేరు చెప్పి జీవించి వున్నవాళ్లనీ, జీవించి లేని వాళ్లనీ (ఉదయ్ కిరణ్) కూడా తన డిస్కషన్స్‌లోకి తెచ్చేసి కాంట్రవర్సీ అయ్యాడు తేజ. ఆ కాంట్రవర్సీల మీద పెట్టిన దృష్టి, సినిమాని సక్సెస్ ఫుల్‌గా తెరకెక్కించడంలో పెట్టి వుంటే బాగుండేదని సినిమా చూశాకా ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేగా.! అంతేగా.!
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!