ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘పెదకాపు’.!
- June 02, 2023కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఎందుకో తెలీదు ఒకింత ఆసక్తి కలిగిస్తుంటాయ్. ఆ కోవకు చెందిందే ‘పెదకాపు’ సినిమా. కాస్టింగ్ తెలీదు. కానీ, పోస్టర్ మాత్రం ఇంట్రెస్టింగ్గా వుంది.
ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే శ్రీకాంత్ అడ్డాల. ఈయన సినిమాలకు ఓ ప్రత్యేకత వుంటుంది. ఫ్యామిలీ సినిమాలను సమర్ధవంతంగా తెరకెక్కించడంలో ఈయనకు సాటి ఈయనే అని చెప్పొచ్చు.
ఇద్దరు స్టార్ హీరోలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’వంటి సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే, ఆ తర్వాత శ్రీకాంత్ సినిమాలకు ఆదరణ కరువయ్యిందనుకోండి.
‘అఖండ’ సినిమాతో ఓ రేంజ్ లాభాలు అందుకున్న నిర్మాత రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.
90ల నాటి బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా రూపొందబోతోందనీ తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ బట్టి తెలుస్తోంది. ఫస్ట్ లుక్ చాలా ప్రామిసింగ్‌గా వుంది. కథ, కథనం కూడా ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ‘ఓ సామాన్యుడి సంతకం’ పెదకాపు.. అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ సినీ జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…