ఢిల్లీ లో 'నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు'ల ప్రదాన కార్యక్రమం

- May 12, 2016 , by Maagulf

'నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డు'ల ప్రదాన కార్యక్రమాన్ని దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏర్పాటు చేశారు. నర్సు వృత్తిలో విశేషమైన సేవలు అందించి ఎంతో మందికి సహాయం చేసినందుకు గాను కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఈ అవార్డులను అందజేస్తుంది.

ఫ్లొరెన్స్‌ నైటింగేల్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఈ సందర్భంగా రోగులకు విశేష సేవలు అందించిన పలువురు నర్సులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com