తనవంతు 'సిఎస్ఆర్' పనులు చేస్తున్న పవన్ కళ్యాణ్

- May 12, 2016 , by Maagulf
తనవంతు 'సిఎస్ఆర్' పనులు చేస్తున్న పవన్ కళ్యాణ్

హీరో, రాజకీయ నాయకుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న నటుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. ఆయన డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీ ఫీ కట్టి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. అసలు విషయం ఏంటంటే... లక్ష్మీదుర్గ డేగల అనే విద్యార్థిని తండ్రి ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. డిగ్రీ చదువుతున్న ఆ అమ్మాయి తన కాలేజీ ఫీజు రూ. 4000 చెల్లించే స్థోమత లేక ట్విట్టర్‌ ద్వారా సహాయం కోరింది.
అదృష్టం కొద్ది ఈ ట్వీట్‌ను పవన్‌కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ చదివారు. తరువాత లక్ష్మీదుర్గ ట్వీట్‌ను పవన్‌కల్యాణ్‌కు చేరేలా చేశారు.పవన్‌ తన సహాయకులను పంపి విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించారు.
దీనిపై లక్ష్మీదుర్గ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పవన్‌కల్యాణ్‌, రేణు దేశాయ్‌లకు ధన్యవాదాలు తెలిపింది. దీనికి రేణు దేశాయ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా స్పందించారు. 'బాగా చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురా. అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. నీ భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com