ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో పేలుడు- 11 మంది మృతి
- June 09, 2023
ఆఫ్గనిస్తాన్: ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల సమయంలో సంభవించిన పేలుడులో 11మంది మరణించగా, 30మంది గాయపడ్డారనిహోం శాఖ తెలిపింది. ఆఫ్ఘన్ తాత్కాలిక ప్రావిన్షియల్ గవరుర్ నిసార్ అహ్మద్ అహ్మది ఈ వారం ప్రారంభంలో ఆత్మాహుతి దళం జరిపిన దాడిలో మరణించారు. బదక్‌షాన్ ప్రావిన్స్ రాజధానిఫైజాబాద్‌లో అహ్మది అంత్యక్రియల సమయంలో పేలుడు సంభవించింది. కాగా ఈ చర్యను హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘన్‌లో భద్రత మెరుగుపడింది కానీ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ముప్పు మాత్రం మిగిలే వుంది. కాగా అహ్మది హత్యకుతమదే బాధ్యత అనిఐఎస్ ప్రకటించింది. పేలుడు పదార్ధాలతో నిండిన కారును ఆయన వాహనంపైకి పోనివ్వడంతో అహ్మదితో పాటు కారు డ్రైవర్ కూడా చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. అహ్మది అంత్యక్రియలకుపెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన సమయంలో గురువారం పేలుడు సంభవించింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









