ప్రభుత్వం అమరావతి వాసులకు ఉచిత వైద్యం
- May 12, 2016
రాష్ట్రం విడిపోయే నాటికి అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటున్న వారందరికీ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2014 డిసెంబర్ 8 నాటికి అమరావతి ప్రాంతంలో నివాసం ఉన్న వాళ్లందరికి తెల్ల, పింక్ రేషన్ రేషన్ కార్డు అన్న తారతమ్యం లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వైద్య సదుపాయం 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందన్నారు.ఎన్టీఆర్ వైద్య సేవ స్కీములో ఉన్న మార్గదర్శకాలన్నీ వీళ్లకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నిర్వహిస్తుందని, నిర్వహణకు ప్రత్యేకంగా సిటీ మేనేజర్‌ను నియమిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ వైద్య సదుపాయానికి అయ్యే ఖర్చు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చెల్లిస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







