పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
- June 09, 2023
తెలంగాణ: మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. నస్పూర్‌లో 26.24 ఎకరాల విస్తీర్ణంలో రూ.41 కోట్ల వ్యయంతో నిర్మించిన మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని, జిల్లా బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. గోదావరి నదిపై రూ. 164 కోట్లతో నిర్మించనున్న మంచిర్యాల అంతర్గాం రహదారి వంతెన, హాజీపూర్ మండలం గుడి పేటలో వైద్య కళాశాల, మందమర్రిలో రూ. 500 కోట్ల వ్యయంతో ఫామ్ ఆయిల్ పరిశ్రమ, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంచిర్యాల నూతన కలెక్టరేట్ భవనంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ''పరిపాలన సంస్కరణ అంటే పది ఆఫీసులు ఏర్పాటు చేసి.. నలుగురి ఆఫీసర్లను పెంచడం కాదు. సంస్కరణ అనేది ఒకరోజుతో అంతం అయ్యేది కూడా కాదు. ఇది నిరంతరం ప్రక్రియ'' అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడేనాటికి ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్ స్థానంలో ఉందని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాబోతున్నాయని, పెద్ద సంఖ్యలో వాటిని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తామని అన్నారు. పామాయిల్‌కు దేశంలో గిరాకీ ఏర్పడుతోందన్న కేసీఆర్.. ఆ తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలన్నారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









