రెజ్లర్లను ఆధారాలను కోరిన ఢిల్లీ పోలీసులు
- June 11, 2023
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లును లైంగిక కేసుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు, వాట్సప్ చాట్ సందేశాలను సమర్పించాలని ఢిల్లీ పోలీసులు కోరినట్లు ఆదివారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు సిఆర్‌పిసి 91 నోటీసులు అందించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ నోటీసు ప్రకారం.. ఫిర్యాదుకు సంబంధించి ఏదైనా పత్రాల్ని సమర్పించాల్సిందిగా ఆదేశించేలా దర్యాప్తు అధికారికి అధికారం ఇస్తుంది. కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న సాక్ష్యాలను అందజేయాలని వారిని కోరినట్లు సమాచారం. పోలీసులు కూడా ఆధారలు సేకరించేందుకు యత్నిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బిజెపి ఎంపి, డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రెజ్లర్లు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు పరిష్కారమైతేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్ గేమ్స్‌లో పాల్గంటామని, లేదంటే వాటిని బహిష్కరిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







