‘స్పై’ వాయిదా.! నిఖిల్‌కే ఇలా ఎందుకు జరుగుతోంది.?
- June 12, 2023
యంగ్ హీరో నిఖిల్ వరుస సక్సెస్‌లు అందుకుంటూ కెరీర్లో విజయ పరంపర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ‘కార్తికేయ 2’ సినిమాని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోయారు. ఆ టైమ్‌లో నిఖిల్ చాలా ఆవేదన చెందాడు.
అయితేనేం, తిరుగులేని హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు నిఖిల్ సిద్దార్ధ్. అంతకు ముందూ నిఖిల్ సినిమాల విడుదల విషయంలో గందరగోళం జరిగిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా నిఖిల్ నటించిన చిత్రం ‘స్పై’.. ఈ నెల 29న రిలీజ్ కావల్సి వుండగా, ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయ్.
అయితే, ఈ సారి వాయిదా పడ్డానికి కారణం నిఖిల్ సిద్దార్డే అంటున్నారు. ఎలాగైనా అదే డేట్‌కి రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తుండగా, పోస్ట్ పోన్ చేయాలంటూ నిర్మాతలతో వివాదానికి దిగుతున్నాడట నిఖిల్.
ఈ సినిమాకి సంబంధించిన నిర్మాణానంతర పనుల పెండింగ్ వల్లే నిఖిల్ అలా వాదిస్తున్నాడనీ, కానీ, రిలీజ్ వాయిదా పడితే, తమ బిజినెస్‌కి నష్టం వాటిల్లుతుందన్న కారణంతో నిర్మాతలున్నారనీ, ఇలా నిర్మాతలకీ, నిఖిల్‌కీ మధ్య జరుగుతోన్న వాగ్వివాదంతో, ఈ సినిమా రిలీజ్ ఇప్పుడు డైలమాలో పడింది.
చూడాలి మరి, ఈ సిట్యువేషన్‌ని నిఖిల్ ఎలా హ్యాండిల్ చేస్తాడో. అన్నట్లు ‘స్సై’ ప్యాన్ ఇండియా సినిమా అన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!







