ఈద్ అల్ అదా: ఎయిర్ పోర్టుల్లో భారీ రద్దీ..!
- June 12, 2023
దుబాయ్: ట్రావెలింగ్ సీజన్ ప్రారంభమైనందున దుబాయ్‌లోని నివాసితులు, సందర్శకులు వారాంతంలో విమానాశ్రయాల వద్ద రద్దీ నెలకొన్నది. పొడవైన క్యూల కారణంగా చెక్ ఇన్ ప్రక్రియ బాగా ఆలస్యం అయిందని పలువురు ప్రయాణికులు తెలిపారు. ఈద్ అల్ అదా సెలవులు ప్రారంభం కాకముందే.. పాఠశాలలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ విమానాశ్రయాలలో రద్దీ నెలకొడం ఆశ్యర్యంగా ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
దుబాయ్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) క్యాలెండర్ ప్రకారం, దుబాయ్‌లో పాఠశాల సెలవులు రెండు వారాల తర్వాత మాత్రమే ప్రారంభమవుతాయి. కొన్ని పాఠశాలలు జూలై 7 వరకు సెలవులు ఇచ్చారు. ట్రావెల్ ఏజెంట్ల ప్రకారం, వారాంతాల్లో భారీ రద్దీతో జూన్ 1న ట్రావెల్ సీజన్ ప్రారంభమైంది. ఈ రద్దీ నెల పొడవునా కొనసాగుతుందని, జూన్ 23 వారాంతంలో యూఏఈ వెలుపల ఈద్ జరుపుకోవాలనుకునే వ్యక్తులు ప్రయాణించే సమయంలో రద్దీ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు. సాఫ్రాన్ ట్రావెల్ అండ్ టూరిజం నుండి ప్రవీణ్ చౌదరి కూడా అవుట్‌బౌండ్ ట్రావెల్ రష్ ప్రారంభమైందని చెప్పారు. "పరీక్షలు ముగిసిన వెంటనే చాలా మంది ప్రజలు ఈ నెలలో భారత ఉపఖండానికి ప్రయాణిస్తారు. " అని అతను తెలిపాడు. జూన్ 27( మంగళవారం) నుండి జూలై 2( ఆదివారం) వరకు ఈద్ అల్ అదా సెలవులు ఉండే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!







