ఒమన్ విమానాశ్రయాలను ఉపయోగించిన 3 మిలియన్ల మంది ప్రయాణికులు

- June 13, 2023 , by Maagulf
ఒమన్ విమానాశ్రయాలను ఉపయోగించిన 3 మిలియన్ల మంది ప్రయాణికులు

మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాలను వినియోగించుకుంటున్న ప్రయాణీకుల సంఖ్య 2023 మార్చి చివరి నాటికి 3 మిలియన్లకు పైగా పెరిగింది. నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన ప్రాథమిక గణాంకాల నివేదిక ప్రకారం.. మార్చి 2023 చివరి వరకు ఒమన్ సుల్తానేట్ మానాశ్రయాల ద్వారా ప్రయాణీకుల సంఖ్య 88 శాతం పెరిగింది. 3,287,015 మంది ప్రయాణికులు నమోదయ్యారు. 2022లో ఇదే కాలంలో 1,746,259 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్చి 2023 చివరి నాటికి మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణీకుల సంఖ్య 2,959,829 మందికి చేరుకుంది. మార్చి 2022 చివరి వరకు 1,473,818 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది 100.8 శాతం పెరిగింది. విమానాశ్రయం ద్వారా విమానాల సంఖ్య కూడా 93.9 శాతం పెరిగి 22,145 విమానాలకు చేరుకుంది. మార్చి 2022 చివరి నాటికి వీటి సంఖ్య 11,419 విమానాలుగా ఉంది. సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణీకుల సంఖ్య మార్చి 2023 చివరి నాటికి 34.2 శాతం పెరిగి 2,184 విమానాలలో 304,538 మంది ప్రయాణికులకు చేరుకుంది. 2022లో ఇదే కాలంతో పోలిస్తే విమానాల సంఖ్య 33.2 శాతం పెరిగింది. సోహార్ విమానాశ్రయం ద్వారా అదే సమయంలో 76 విమానాల్లో 5,401 మంది ప్రయాణికులు చేరుకోగా, దుక్మ్ విమానాశ్రయం ద్వారా 152 విమానాల్లో 17,247 మంది ప్రయాణించారని నివేదికలో పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com