RP పట్నాయక్ మెలోడీలతో మరో ఈవెంట్ అందించిన ఆంధ్ర కళా వేదిక
- June 13, 2023
దోహా: దోహా, ఖతార్ లోని అద్భుతమైన ప్రాంగణం "లా సిగాలే" హోటల్ లోని అల్ వాజ్బా బాల్ రూమ్ లో వేసవి తాపాన్ని తీర్చే కార్యక్రమం "సమ్మర్ ఫీస్ట్" ను "రవి మెలోడీస్" ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ఆద్యంతమూ ఆర్పీ పట్నాయక్ గళం, అయన పంచుకున్న అనుభవాలు, ఓపికతో ఇచ్చిన ఫొటోల అనుమతి అందరిని మంత్ర ముగ్ధులను చేసాయి. "మనసంతా నువ్వే" అంటూ మదిలోని మధుర స్మృతులను కళ్ళముందుకి తెచ్చాయి. ఆర్పీ తో పాటుగా సత్య యామిని, GV భాస్కర్ మరియు రవి పాటలు ప్రేక్షకులను సీట్లకు కట్టి పడేస్తే, తెలంగాణ సింగర్ లక్ష్మి పాటలతో హాలంతా కేరింతలు, ఈలలు డాన్సులతో దద్దరిల్లింది. ఆద్యంతమూ హుషారుగా సాగిన రమణీయమైన, మధురమైన పాటల పరంపర ఖతార్ తెలుగువారందరిని ఉర్రూతలూగించటమే కాక వారికి మరవలేని అనుభూతిని మిగిలింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ బాషా, కళా, సాంస్కృతిక మరియు సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని వేయి నోళ్ల పొగిడారు. ఇలాగే కార్యక్రమాలు చేస్తూ ఉండాలని అభినందించారు.
ఈ కార్యక్రమానికి ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఉన్న అత్యున్నత సంస్థల (ICC, ISC, ICBF) వారి ప్రతినిధులందరూ హాజరయినారు. అలాగే తెలుగు ప్రముఖులు KS ప్రసాద్ మరియు తెలుగు సంస్థల (TGS, TJQ, TPS, TKS, TBA) అధ్యక్షులు, వారి ప్రతినిధులందరూ కూడా హాజరయినారు. కార్యక్రమ నిర్వహణ విధానం, హాజరైన వారి స్పందన, నినాదాలు వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాయి. ఆంధ్ర కళా వేదిక కార్యవర్గం వారందరినీ పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సన్మానించడం జరిగింది.
ఆంధ్ర కళావేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతార్ లోని నలుమూలల నుండి విశేషంగా సుమారు 1000 మందికి పైగా హాజరయ్యారని, ఈ కార్యక్రమం 2023 సంవత్సరంలో వరుసగా 4వ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని, ఆదరించి విజయవంతం చేసిన అందరికి శత సహస్ర వందనములు తెలియజేసారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి అవకాశం కల్పించి సహకరించిన ప్రాయోజితులు(స్పాన్సర్స్)కి ముఖ్యంగా IGPL అధినేత శ్యాంబాబు గంధం, రవి మెలోడీస్ అధినేత రవి కుమార్ మంద కి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్) గా సహకరించిన వారికి, కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన మీడియా సహకారాన్ని అందిస్తున్న మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అదే వేదికపై నట సింహం నందమూరి బాలకృష్ణ 63వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్పీ పట్నాయక్ గారి సమక్షంలో అభిమానుల చేతుల మీదుగా కేక్ కటింగ్ కూడా జరిగింది. హాజరైనవారందరికి షడ్రసోపేతమైన రుచికరమైన భోజనం అందించారు. ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, శ్రీ సుధ, శిరీష రామ్, శేఖరం రావు, సాయి రమేష్, సోమరాజు, రవీంద్ర, వీబీకే మూర్తి బృందం చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు మరియు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు. విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి