యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: నివాసితులకు వైద్య నిపుణుల సూచనలు

- June 14, 2023 , by Maagulf
యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: నివాసితులకు వైద్య నిపుణుల సూచనలు

యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వేడి సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న పలువురు రోగుల సంఖ్య ఇటీవల పెరిగిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వేడి దద్దుర్లు, తిమ్మిరి, హీట్ స్ట్రోక్స్ లాంటి అనారోగ్య సమస్యలతో బాధితులు ఆస్పత్రుల్లో చేరారని తెలిపారు. ఈ పరిస్థితులు తేలికపాటి అసౌకర్యం నుండి తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితుల వరకు ఉంటాయని ఆరోగ్య సంరక్షణ నిపుణులు వివరిస్తున్నారు. ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

అజ్మాన్‌లోని తుంబే యూనివర్శిటీ హాస్పిటల్ స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ మైస్ ఎమ్ మౌఫక్ మాట్టాడుతూ.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా, వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు పని గంటలలో సూర్యరశ్మికి గురయ్యే బహిరంగ కార్మికులలో తరచుగా వేడి దద్దుర్లు, వేడి తిమ్మిరి,  వేడి అలసట వంటి హీట్ ఎక్స్‌పోజర్‌కు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయని ఆయన చెప్పారు. రోజువారీ నీటి తీసుకోవడం కనీసం 500-1000 ml పెంచడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండాలని సలహా ఇచ్చారు. తేలికపాటి దుస్తులు ధరించాలని, సూర్య రష్మి నుంచి రక్షణ పొందాలన్నారు. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి భారీ భోజనం మానుకోవాలన్నారు. చల్లటి నీటితో తరచుగా శరీర స్నానాలు చేయాలని సూచించారు. స్థానిక వైద్య అధికారులు అందించిన మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు.  అధిక చెమట, కండరాల తిమ్మిరి, మూర్ఛ, అలసట, బలహీనమైన మరియు వేగవంతమైన పల్స్, శరీర నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా సమీప ఆస్పత్రికి వెళ్లి వైద్య సాయాన్ని పొందాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com