భారతీయ నటిపై కేసును కొట్టేసిన కోర్టు..!

- June 14, 2023 , by Maagulf
భారతీయ నటిపై కేసును కొట్టేసిన కోర్టు..!

యూఏఈ: షార్జా ఎయిర్‌పోర్ట్‌లో మాదకద్రవ్యాల ఆరోపణ కేసులో నిర్బంధించబడిన భారతీయ నటి కేసును కోర్టు క్లియర్ చేసింది. ఈ మేరకు ఆమె న్యాయవాది, అల్ రెధా అండ్ కంపెనీలో లాయర్,  లీగల్ కన్సల్టెంట్ మహ్మద్ అల్ రెధా తెలిపారు. జూన్ 12న ఆమెపై నమోదైన అన్ని అభియోగాలను కోర్టు కొట్టేసినట్లు పేర్కొన్నారు. రెధా కథనం ప్రకారం, ఆడిషన్ మరియు హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో పాత్ర కోసం 27 ఏళ్ల ఇద్దరు వ్యక్తులు ఆమెను 'మోసం' చేశారు. నటనా ప్రదర్శనలో పాల్గొనాలనే భావనతో ఆమె యూఏఈకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు నటిని మోసగించి షార్జాకు ట్రోఫీని తీసుకువెళ్లాలని కోరారు. అమెకు తెలియకుండా అందులో మత్తుపదార్థాలు దాచారు. ఏప్రిల్ 1న నటి ముంబై నుంచి షార్జా ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు, డ్రగ్స్ కలిగి ఉన్నందుకు అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నటిని 20 రోజులకు పైగా నిర్బంధించారు.  ఆమె పాస్‌పోర్ట్ జప్తు చేశారు. తరువాత షరతులతో కూడిన బెయిల్‌పై నటి విడుదలైంది. ప్రస్తుతం ఎమిరేట్స్‌లో తన బంధువులతో నివసిస్తుంది.  నటిపై విధించి ప్రయాణ నిషేధం ఎత్తివేశారని,  త్వరలో ఆమె పేరు బ్లాక్ లిస్ట్ నుండి ఉపసంహరించబడుతుందని అల్ రెధా పేర్కొన్నారు. ఆమె పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వమని అభ్యర్థించామని, దాని కోసం ఎదురుచూస్తున్నట్టు అల్ రెధా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com