పవన్‌తో ‘పొగరు’ పోటీకి సై సై అంటోన్న ముద్దుగుమ్మ.!
- June 14, 2023
‘పొగరు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీయా రెడ్డి, తాజాగా ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. అదే పనర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న ‘ఓజీ’లో శ్రియా రెడ్డి ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం ఎంపికైందని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
అప్పుడెప్పుడో ‘అమ్మ చెప్పింది’ సినిమాలో నటించిన శ్రియా రెడ్డి తెలుగులో చేసిన సినిమాలు చాలా చాలా తక్కువ. తమిళంలో ఒకటీ అరా సినిమాలు చేసి, విశాల్ సోదరుడ్ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది.
ఇటీవల ‘సుజల్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలో తళుక్కున మెరిసింది. ఈ సిరీస్‌లో శ్రియా రెడ్డి నటనకు ఓటీటీ ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టేశారు. సీరియస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించింది శ్రియా రెడ్డి ఇందులో.
తాజాగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఛాన్స్ పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్