మహానటి లిస్టులో మరో హీరోయిన్ సెంట్రిక్ మూవీ.!

- June 14, 2023 , by Maagulf
మహానటి లిస్టులో మరో హీరోయిన్ సెంట్రిక్ మూవీ.!

‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ సత్తా చాటింది. తానేంటో టాలీవుడ్‌కి చూపించింది. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఛెయిర్‌ని అధిరోహించేసింది.

అయితే, ఆ తర్వాత కీర్తి సురేష్ కెరీర్ కాస్త అటూ ఇటూ ఊగిసలాడినప్పటికీ రీసెంట్‌గా ఆమె నటించిన ‘సర్కారు వారి పాట’, ‘దసరా’ సినిమాలతో మళ్లీ కీర్తి సురేష్ కెరీర్ గాడిన పడింది.

ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించనుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్‌తో ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీకి దిల్ రాజు శ్రీకారం చుట్టబోతున్నారు.

ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట. నటుడు సుహాస్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. 

త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నట్లు రాజుగారి కంపెనీ నుండి అందుతోన్న తాజా ఖబర్. కాగా, గతంలో కీర్తి సురేష్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’ని కూడా దిల్ రాజే తన సొంత బ్యానర్‌లో నిర్మించారు. అయితే, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. కానీ, తాజా ప్రాజెక్ట్‌పై రాజుగారు పూర్తి నమ్మకంతో వున్నట్లు తెలుస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com