రక్తదానం చేసిన ఒమానీ దౌత్యవేత్తలు
- June 15, 2023
మస్కట్: ప్రపంచంలోని వివిధ దేశాలలోని ఒమానీ రాయబార కార్యాలయాలు, మస్కట్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించారు. ఒమన్ దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యులు, ఒమన్ సుల్తానేట్ ఎంబసీలోని ఉద్యోగులు రక్తదానం చేయడానికి గుర్తింపు పొందిన దేశాలలోని ఆసుపత్రులను సందర్శించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సిబ్బంది కూడా సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ హాస్పిటల్ నిర్వహించిన క్యాంప్ లో రక్తదానం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు, వైద్య కేంద్రాలలో రక్తం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడటానికి మానవతా చర్యగా ఆరోగ్య రంగానికి మద్దతు ఇవ్వడం, రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్తదాన కార్యక్రమం మానవీకరణ, నిస్వార్థత, సామాజిక బాధ్యత, భాగస్వామ్యం, మానవతా ధార్మిక కార్యకలాపాల విలువను పెంచిందన్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







